సోమవారం 30 మార్చి 2020
National - Mar 20, 2020 , 16:59:44

కనికా పార్టీ ఎఫెక్ట్‌..ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌

కనికా పార్టీ ఎఫెక్ట్‌..ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌

బాలీవుడ్‌ సింగర్‌ కనికాకపూర్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. అయితే కనికాకపూర్‌కు సంబంధించిన ఓ పార్టీకి రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ హజరయ్యారట. కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుసుకున్న ఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కనికాకపూర్‌ మార్చి 15న లండన్‌ నుంచి లక్నోకు చేరుకున్న తర్వాత తన కుటుంబసభ్యులు, స్నేహితులకు  ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి పలువురు రాజకీయనాయకులు, సామాజిక వేత్తలు హాజరయినట్లు తెలుస్తోంది. logo