శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:19:06

బాబీజీ పాప‌డ్ తింటే.. క‌రోనా దూరం: కేంద్ర మంత్రి

బాబీజీ పాప‌డ్ తింటే.. క‌రోనా దూరం: కేంద్ర మంత్రి

హైద‌రాబాద్‌: కేంద్ర జ‌ల‌వ‌న‌రుల స‌హాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ‌వాల్ .. బాబీజీ పాప‌డ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. అయితే ఆ పాప‌డాల‌ను తింటే.. క‌రోనా వైర‌స్ దూరం అవుతుంద‌న్నారు.  దీనికి సంబంధించిన ఓ వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన బీజేపీ నేత‌.. బాబీజీ పాప‌డ్ బ్రాండ్ పేరుతో ఉన్న పాప‌డాల‌ను ఆవిష్క‌‌రించారు. ఈ పాప‌డాల‌ను తింటే శ‌రీరంలో క‌రోనాతో పోరాడే యాంటీబాడీలు ఉత్ప‌త్తి అవుతాయ‌న్నారు.  పాప‌డాల్లో ఉన్న మిశ్ర‌మాలు.. వైర‌స్‌తో పోరాడుతాయ‌న్నారు. ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ స్కీమ్ కింద ఓ వ్య‌క్తి పాప‌డ్ కంపెనీ స్టార్ట్ చేశాడు.  ఆ ఉత్ప‌త్తిని రిలీజ్ చేసిన మంత్రి ఈ విధంగా కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్‌లో.. జోకులు పేలుతున్నాయి.


 


logo