సోమవారం 30 మార్చి 2020
National - Mar 16, 2020 , 13:49:49

విశ్వాస‌ప‌రీక్ష పెట్టండి.. సుప్రీంను ఆశ్ర‌యించిన‌ బీజేపీ

విశ్వాస‌ప‌రీక్ష పెట్టండి.. సుప్రీంను ఆశ్ర‌యించిన‌ బీజేపీ

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఇవాళ జ‌ర‌గాల్సిన విశ్వాస‌ప‌రీక్ష వాయిదా ప‌డింది.  స్పీక‌ర్ ఎన్‌పీ ప్ర‌జాప‌తి అసెంబ్లీని ఈనెల 26వ తేదీ వ‌ర‌కు వాయిదా వేశారు.  ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌ర‌గాల్సిన ఫ్లోర్ టెస్ట్ నిలిచిపోయింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.  మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్ర‌యించారు.  కేవ‌లం 12 గంట‌ల్లోనే బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని బీజేపీ ఎమ్మెల్యేల‌ను సుప్రీంను కోరారు.  అయితే అభ్య‌ర్థ‌న‌పై రేపు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీం పేర్కొన్న‌ది. శివ‌రాజ్ ఇవాళ 106 మంది ఎమ్మెల్యేల‌తో గ‌వ‌ర్న‌ర్ టాండ‌న్‌ను కూడా క‌లిశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయింది. జ్యోతిరాదిత్య సింధియా ఇటీవ‌ల క‌మ‌ల్‌నాథ్ టీమ్ నుంచి బ్రేక‌ప్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు.  దీంతో క‌మ‌ల్ ప్ర‌భుత్వం క‌ష్టాల్లో ప‌డింది. సింధియా వ‌ర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డంతో.. క‌మ‌ల్ ప్ర‌భుత్వ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ సీఎం క‌మ‌ల్‌.. బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కోవాల్సి ఉండే. కానీ స‌భ ప్రారంభం అయిన కొద్ది సేప‌టికి.. క‌రోనా వైర‌స్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో స్పీక‌ర్ వాయిదా వేశారు. విశ్వాస‌ప‌రీక్ష అప్ర‌జాస్వామిక‌మ‌వుతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్‌కు సీఎం క‌మ‌ల్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ బంధించింద‌న్నారు. 


logo