గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 18:54:34

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా.. మిగతా ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌

బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా.. మిగతా ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ సీనియ‌ర్ బీజేపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు శుక్ర‌వారం రాత్రి వైద్యులు తెలిపారు. ఆయ‌న భార్య‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. అయితే శుక్ర‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆ బీజేపీ ఎమ్మెల్యే పాల్గొని త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఎన్నిక‌లు అయిపోయాక ఎమ్మెల్యే వైద్య నివేదిక రావ‌డంతో.. మిగ‌తా ఎమ్మెల్యేలు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో కొంత‌మంది ఎమ్మెల్యేలు ఆస్ప‌త్రుల‌కు వెళ్లి ర‌క్త న‌మూనాలను టెస్టుల కోసం ఇచ్చారు. 

క‌రోనా సోకిన ఎమ్మెల్యే ఎవ‌రెవ‌రినీ క‌లిశాడు.. ఎక్క‌డెక్క‌డ తిరిగాడు అనే అంశాల‌పై దృష్టి సారించిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా సోకిన రెండో ప్ర‌జాప్ర‌తినిధిగా బీజేపీ ఎమ్మెల్యే నిలిచారు. అయితే ఎమ్మెల్యే భార్య‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం అస్వ‌స్థ‌త‌గా ఉండ‌డంతో ఆమె వైద్య సిబ్బందిని ఇంటికి పిలిచి.. ఇద్ద‌రి ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చారు. వీరిద్ద‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు రాత్రికే వైద్యులు తెలిపారు.

క‌రోనా సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పీపీఈ సూట్ లో ఆ రాష్ర్ట అసెంబ్లీకి వ‌చ్చి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటేశారు. 


logo