శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 18:03:58

గాల్లోకి కాల్పులు..బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

గాల్లోకి కాల్పులు..బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

లక్నో: ఓ వివాహ వేడుకలో గాల్లోకి కాల్పులు (సెలబ్రేటరీ ఫైరింగ్‌)జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విజేంద్రసింగ్‌ ఖతిక్‌ చట్టవిరుద్ధంగా పిస్తోల్‌తో గాల్లోకి పదేపదే కాల్పులు జరిపిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారి సంతోష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. వేడుకల్లో ఆయుధాలు ఉపయోగించడం నేరమనే విషయం తెలిసిందే. దీనికి రూ.లక్ష జరిమానా లేదా రెండేళ్లు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు కలిపి విధించే అవకాశముంటుంది. 


logo