గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 15:45:37

నేను బీజేపీతోనే...నాకు ప్రాణహాని ఉంది

నేను బీజేపీతోనే...నాకు ప్రాణహాని ఉంది

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించడం కోసమే ఆ పార్టీ నేతలను బీజేపీ లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ పాఠక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

తాను సీఎం కమల్‌నాథ్‌కు ఫోన్‌ చేశానని, త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వచ్చిన వార్తలను సంజయ్‌ పాఠక్‌ కొట్టిపారేశారు. పార్టీలో ఎలాంటి అయోమయాన్ని సృష్టించకండి. నేను బీజేపీలోనే ఉన్నా, బీజేపీతోనే ఉంటా. ఈ వ్యక్తులు (కాంగ్రెస్‌ నేతలు)తమ రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఎక్కడైనా చంపేందుకు కూడా ప్రయత్నించవచ్చు. ప్రజలంతా నన్ను చంపకుండా చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సంజయ్‌పాఠక్‌. ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. logo