శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:10:13

ఎమ్మెల్యేపై రేప్ కేసు.. డీఎన్ఏ శ్యాంపిళ్లు ఇవ్వాల్సిందే

ఎమ్మెల్యేపై రేప్ కేసు.. డీఎన్ఏ శ్యాంపిళ్లు ఇవ్వాల్సిందే

హైద‌రాబాద్‌:  ఉత్త‌రాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మ‌హేశ్ నేగిపై అత్యాచార ఆరోప‌ణ కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే.  త‌న‌ను రేప్ చేసిన‌ట్లు ఓ మ‌హిళ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఆ కేసులో ఇవాళ ఉత్త‌రాఖండ్‌కు చెందిన ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఎమ్మెల్యే మ‌హేశ్ నేగి.. త‌న డీఎన్ఏ శ్యాంపిళ్ల‌ను ఇవ్వాల‌న్న‌ది.  లైంగిక వేధింపుల‌తో సంబంధం ఉన్న కేసులో జ‌న‌వ‌రి 11వ తేదీన ఎమ్మెల్యే నేగి త‌న డీఎన్ఏ శ్యాంపిళ్ల‌ను ఇవ్వాల‌ని ఆదేశించింది.  సీజేఎం కోర్టు స‌మ‌క్షంలోనే శ్యాంపిళ్లు ఇవ్వాల‌ని ఆదేశించారు.  అయితే ఎమ్మెల్యే నేగి ఆరోగ్యంగా లేర‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. సెప్టెంబ‌ర్‌లో ఎమ్మేల్యే నేగిపై లైంగిక ఆరోప‌ణ‌ల కింద కేసు న‌మోదు అయ్యింది. బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆరోప‌ణ‌లపై ఎమ్మెల్యే భారీ రీటా నేగిపైన కూడా కేసు దాఖ‌లు చేశారు.  త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు కుట్ర ప‌న్నిన‌ట్లు ఆ ఎమ్మెల్యే ఆరోపించారు.  ఆగస్టు 16వ తేదీన ఎమ్మెల్యేపై ఓ మ‌హిళ రేప్ కేసు దాఖ‌లు చేసింది. ఆ ఎమ్మెల్యే వ‌ల్ల త‌న‌కు కూతురు పుట్టిన‌ట్లు ఆ ఫిర్యాదు పేర్కొన్న‌ది. ఒక‌వేళ త‌న ఆరోప‌ణ‌లు నిజం కాదంటే, డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వహించాల‌ని ఆమె డిమాండ్ చేసింది.