శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 13:18:49

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

చెన్నై: పుదుచ్చేరికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ట్రెజ‌ర‌ర్ కేజీ శంక‌ర్ (71) ఆదివారం ఉద‌యం ఇలాంగోన‌గర్‌లోని త‌న నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఉద‌యం నిద్ర‌లేవగానే ఛాతిలో నొప్పిగా ఉంద‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు చెప్పిన ఆయ‌న.. వారు ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గానే క‌న్నుమూశారు. కేజీ శంక‌ర్‌కు భార్య‌, ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. 1950లో పుదుచ్చేరిలో జ‌న్మించిన శంక‌ర్‌.. 1984 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీ నాయ‌కుడిగా కొన‌సాగారు. 

కాగా, శంక‌ర్ మృతిప‌ట్ల‌ పుదుచ్చేరికి చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రూ సంతాపం వ్య‌క్తంచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్‌బేడీ, ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, స్పీక‌ర్ శివ కొలంతు, రెవెన్యూ మంత్రి షాజ‌హాన్‌, పుదుచ్చేరి బీజేపీ అధ్య‌క్షుడు వీ సామినాథ‌న్ ఎమ్మెల్యే శంక‌ర్ మృతికి సంతాపం తెలియ‌జేశారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo