శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 12:38:27

ఒడిశాలో బీజేపీ ఎమ్మెల్యే హ‌ఠాన్మ‌ర‌ణం

ఒడిశాలో బీజేపీ ఎమ్మెల్యే హ‌ఠాన్మ‌ర‌ణం

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో బీజేపీ ఎమ్మెల్యే మ‌ధ‌న్‌మోహ‌న్ ద‌త్తా (62) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఇప్ప‌టికే కిడ్నీ, హృద‌య సంబంధ రోగాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న.. బుధ‌వారం ఉద‌యం గుండెపోటు రావ‌డంతో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు గురైన ఎమ్మెల్యే ద‌త్తాను కుటుంబ‌స‌భ్యులు భువ‌నేశ్వ‌ర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఉద‌యం మ‌రోసారి గుండెపోటు రావ‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలోనే తుదిశ్వాస విడిచారు. 

ఎమ్మెల్యే ద‌త్తా బాలాసోర్ జిల్లా స‌ద‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాగా, ద‌త్తా మ‌ర‌ణవార్త తెలియ‌గానే ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ద‌త్తా కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. తాను సోద‌రుడి లాంటి వ్య‌క్తిని కోల్పోయాన‌ని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ విచారం వ్య‌క్తం చేశారు.    logo