శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 09:58:21

ఉరేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

ఉరేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!

కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ ఉరేసుకున్నారు. ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ హెమ్తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే త‌న సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో ఉన్న బిందాల్ వ‌ద్ద ఎమ్మెల్యే మృత‌దేహం క‌నిపించింది. 

ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే

అయితే ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై కుటుంబ స‌భ్యులు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య కాదు.. ఇది రాజ‌కీయ హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. హ‌త్య చేసి ఉరేశార‌ని పేర్కొన్నారు.

నిన్న రాత్రి కొంద‌రు వ‌చ్చి ఎమ్మెల్యేను బైక్ పై ఎక్కించుకు పోయార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. తెల్లారేస‌రికి బిందాల్ ఏరియాలో  మూసివేసిన దుకాణం వ‌రండాలో ఎమ్మెల్యే వేలాడుతుండ‌టాన్ని స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

దేబేంద్ర నాథ్ సీపీఐ-ఎం పార్టీని వీడి 2019, మే నెల‌లో బీజేపీలో చేరారు. ఆయ‌న‌తో పాటు 50 మంది కౌన్సిల‌ర్లు.. బీజేపీ సీనియ‌ర్లు ముకుల్ రాయ్, కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ స‌మ‌క్షంలో క‌మ‌లం పార్టీలో చేరారు. 


logo