శుక్రవారం 03 జూలై 2020
National - Jan 24, 2020 , 16:01:20

అసెంబ్లీకి మిడతలను తీసుకొచ్చిన ఎమ్మెల్యే..

అసెంబ్లీకి మిడతలను తీసుకొచ్చిన ఎమ్మెల్యే..

సాధారణంగా మార్కెట్‌లో ధరలు పెరిగినపుడు పెరిగిన వస్తువులను అసెంబ్లీకి తీసుకొచ్చి నిరసన తెలుపుతుంటారు ఎమ్మెల్యేలు.

రాజస్థాన్‌: సాధారణంగా మార్కెట్‌లో ధరలు పెరిగినపుడు పెరిగిన వస్తువులను అసెంబ్లీకి తీసుకొచ్చి నిరసన తెలుపుతుంటారు ఎమ్మెల్యేలు. కానీ బీజేపీ ఎమ్మెల్యే బిహారీ లాల్‌ నోఖా ఏకంగా అసెంబ్లీకి మిడతలనే (పంటను పాడు చేసే పురుగులు) పట్టుకువచ్చారు. మిడతలను ప్యాక్‌ చేసి ఉన్న తట్టను ఎమ్మెల్యే బిహారీ లాల్‌ నోఖా తలపై పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి..నిరసన తెలియజేశారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ...మిడతల వల్ల రైతులు పెద్ద మొత్తంలో పంట నష్టపోతున్నారు. మిడతల వల్ల ఏడు లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే బిహారీ లాల్‌ డిమాండ్‌ చేశారు. 


logo