గురువారం 02 జూలై 2020
National - Feb 05, 2020 , 21:41:39

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది: మమతా బెనర్జీ

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది: మమతా బెనర్జీ

నడియా: ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ  అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నడియాలో మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. మత విద్వేశాలను రెచ్చగొట్టే ఆ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. గత 12 నెలల కాలంలో ఆ పార్టీ 5 రాష్ర్టాల్లో అధికారం కోల్పోవడమే అందుకు నిదర్శనమని ఆమె తెలిపారు. ఇన్ని రాష్ర్టాల్లో అధికారం కోల్పోయిన ఆ పార్టీకి, పార్టీ పెద్దలకు సిగ్గులేదని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో సాధ్యం కాని హామీలు ఇస్తున్న ఆ పార్టీ.. ఎంతకైనా తెగించగలదనీ, వారు జైల్లు, నిర్భంద కేంద్రాలు మినహాయించి దేశంలో దేన్నైనా అమ్మగలరని విమర్శించారు. కాగా, బీజేపీ గత 12 నెలల కాల వ్యవధిలో 5 రాష్ర్టాల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. 

బీజేపీ అధికారం కోల్పోయిన 5 రాష్ర్టాలు: 

ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌.logo