గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 17:37:59

కేంద్రం ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్న‌ది: సోనియాగాంధీ

కేంద్రం ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్న‌ది: సోనియాగాంధీ

న్యూఢిల్లీ:  దేశంలోని గ‌త కొన్ని రోజుల నుంచి ఇంధ‌న ధ‌ర‌లు వ‌రుసగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధ‌న ధ‌ర‌ల పెంపు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ సోమ‌వారం దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక నేత‌లు ఆందోళ‌న‌కు దిగగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆమె కేంద్ర ప్ర‌భుత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. 

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్నవేళ కేంద్ర ప్ర‌భుత్వం ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచుతూ ప్ర‌జ‌ల సొమ్మును దోపిడీ చేస్తున్న‌ద‌ని సోనియా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని దోచుకుని ప్ర‌భుత్వం ల‌బ్ధి పొందుతున్న‌ద‌ని ఆమె విమ‌ర్శించారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గుతున్నా 2014లో అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు ఇప్ప‌టివ‌‌ర‌కు మోదీ స‌ర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై 12 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింద‌ని సోనియాగాంధీ ఆరోపించారు.      


logo