గురువారం 16 జూలై 2020
National - Jun 17, 2020 , 15:49:21

టిక్‌ టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్‌ అరెస్టు

టిక్‌ టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్‌ అరెస్టు

హర్యానా : టిక్‌ టాక్‌ స్టార్‌, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి పోగాట్‌ని పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ నెల ప్రథమార్థంలో హిసార్‌ జ్లిలాలోని బల్సామండ్‌ గ్రామంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారి సుల్తాన్‌ సింగ్‌ని బహిరంగ ప్రదేశంలో సోనాలి పోగాట్‌ చెప్పుతో కొట్టింది. ఇదంతా కెమెరాలో రికార్డు అయి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. బాధిత అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు సోనాలి పోగాట్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 147(అల్లర్లకు పాల్పడటం), సెక్షన్‌ 149(చట్టవ్యతిరేక సమావేశం) సెక్షన్‌ 332(విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని గాయపరచడం), సెక్షన్‌ 506(నేరపూరిత స్వభావం) కింద ఆమెపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

తనపట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంతో ఆగ్రహించి అతడిపై దాడి చేసినట్లు సోనాలి పేర్కొంది. ఈ అంశంపై తను కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు వ్యవసాయ అధికారి సుల్తాన్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌ 354( మహిళా గౌరవాన్ని కించపరచడం), సెక్షన్‌ 509 (ఉద్దేశపూర్వకంగా మహిళను అవమానపరచడం) కింద కేసులు నమోదు చేశారు.


logo