బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 16, 2020 , 17:06:51

మనోహర్‌ పారికర్‌ తనయుడికి కరోనా పాజిటివ్‌

మనోహర్‌ పారికర్‌ తనయుడికి కరోనా పాజిటివ్‌

పనాజీ: బీజేపీ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ కరోనా బారినపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఉత్పల్‌ తెలిపారు. వైద్య పరీక్షల ఫలితం రాగానే ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. మైల్డ్‌ ఇన్ఫెక్షన్‌ కాబట్టి నేను హోం క్వారంటైన్‌లో ఉంటానని శనివారం సాయంత్రం చెప్పారు. 'వైద్యుల సలహా మేరకు, సరైన చికిత్స తీసుకోవడానికి నేను ఆస్పత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఉత్పల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.