e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి

బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి

బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా హుగ్లీలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. హుగ్లీలో పోలింగ్ స‌ర‌ళిని తెలుసుకునేందుకు త‌న కారు వెళ్లిన బీజేపీ మ‌హిళా నేత‌ను 66వ నంబ‌ర్ పోలింగ్ బూత్ వ‌ద్ద స్థానికులు అడ్డుకున్నారు. ఆమె కారుపై దాడికి పాల్ప‌డ్డారు. అయితే సీఆర్‌పీఎఫ్ పోలీసులు వారిని నెట్టివేయ‌డంతో మీడియా వాహ‌నాల‌పై దాడిచేశారు. దాంతో స్థానికంగా వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘ‌ట‌న‌పై లాకెట్ చ‌ట‌ర్జీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. హుగ్లీలోని 66వ నంబ‌ర్ పోలింగ్ బూత్ వ‌ద్ద స్థానికులు త‌న‌పైన దాడికి పాల్ప‌డ్డార‌ని, జ‌ర్న‌లిస్టుల‌పై కూడా దాడి చేశార‌ని చెప్పారు. అందువ‌ల్ల వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను పంపాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు

ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !

ప్లే గ్రౌండ్‌లో మిస్సైల్‌.. షాకైన పిల్ల‌లు..!

కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..

పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి
బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి
బెంగాల్ ఎన్నిక‌లు: ‌బీజేపీ మ‌హిళా నేత‌ వాహ‌నంపై స్థానికుల దాడి

ట్రెండింగ్‌

Advertisement