గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 13:59:48

ఎల్‌కే అద్వానీకి అంద‌ని అయోధ్య ఆహ్వానం..

ఎల్‌కే అద్వానీకి అంద‌ని అయోధ్య ఆహ్వానం..

హైద‌రాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి ఉమా భార‌తి, యూపీ మాజీ సీఎం క‌ళ్యాణ్ సింగ్‌ల‌కు అయోధ్య ఆహ్వానం అందింది.  ఈనెల 5వ తేదీన అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం భూమి పూజ జ‌ర‌గ‌నున్న‌ది.  ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనే అతిథుల‌కు ఆహ్వానాలు పంపిస్తున్నారు. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి మాత్రం ఆహ్వానం అంద‌న‌ట్లు స‌మాచారం ఉన్న‌ది.  బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ఇటీవ‌లే ఆయ‌న ల‌క్నో సీబీఐ కోర్టు వ‌ర్చువ‌ల్‌ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 92 ఏళ్ల అద్వానీని ఈ కేసులో నాలుగున్న గంట‌ల పాటు విచారించారు. మ‌రో బీజేపీ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికి కూడా ఆహ్వానం పంప‌లేదు. ప్ర‌ధాని మోదీ భూమిపూజ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. 

 

తాజావార్తలు


logo