సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 11:40:44

సింధియా చేరిక బీజేపీకి బలం : అమిత్‌ షా

సింధియా చేరిక బీజేపీకి బలం : అమిత్‌ షా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా సింధియాకు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయాలనే బీజేపీ సంకల్పానికి.. సింధియా చేరిక మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

అమిత్‌ షాతో భేటీ కంటే ముందు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సింధియా కలిశారు. నిన్న బీజేపీలో చేరిన సందర్భంగా మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతలను సింధియా కలుస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా బీజేపీలో చేరిన విషయం విదితమే. సింధియాకు అనుకూలంగా ఉన్న 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. 


logo