బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 18:26:59

'పులి ఇంకా బ‌తికే ఉంది': జ‌్యోతిరాదిత్య సింధియా.. వీడియో

'పులి ఇంకా బ‌తికే ఉంది': జ‌్యోతిరాదిత్య సింధియా.. వీడియో

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌మ‌ల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ స‌ర్కారును కూల్చి బీజేపీలో చేర‌డంతోపాటు, మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ నేత‌ శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కార‌ణ‌మైన‌ జ్యోతిరాదిత్య సింధియాపై కాంగ్రెస్ పార్టీ త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్న‌ది. సీనియ‌ర్ నేత‌లు దిగ్విజ‌య్‌సింగ్‌, క‌మ‌ల్‌నాథ్‌లు అవ‌కాశం దొరిక‌న‌ప్పుడ‌ల్లా జ్యోతిరాదిత్య సింధియాపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. 

ఈ విష‌య‌మై మీడియా ప్ర‌తినిధులు జ్యోతిరాదిత్య సింధియాను ప్ర‌శ్నించ‌గా ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు. త‌న వ్య‌వ‌హార శైలికి సంబంధించి దిగ్విజ‌య్ సింగ్ స‌ర్టిఫికెట్ గానీ, క‌మ‌ల్‌నాథ్ స‌ర్టిఫికెట్ గానీ అవ‌స‌రం లేద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 15 నెల‌ల స్వ‌ల్ప కాలంలోనే మ‌ధ్యప్ర‌దేశ్ ప్ర‌జ‌లు దోపిడీ చేసింద‌ని సింధియా ఆరోపించారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే కాంగ్రెస్ నేత‌ల‌కు తాను ఒక విష‌యం చెప్ప‌దలుచుకున్నానన్న సింధియా.. టైగ‌ర్ అభీ జిందా హై (పులి ఇంకా బ‌తికే ఉంది) అని వ్యాఖ్యానించారు. 

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో త‌న‌కు క‌మ‌ల్‌నాథ్ స‌ర్కారు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌డంలేద‌ని ఆరోపిస్తూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తెచ్చారు. త‌న వ‌ర్గానికి చెందిన‌ 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల‌తో పార్టీకి రాజీనామా చేయించి.. బీజేపీ చేరారు. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌మ‌ల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్  స‌ర్కారు కూలిపోయి, శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


తాజావార్తలు


logo