బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 12:13:49

ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే కిడ్నాప్‌లు, దోపిడీలే

ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే కిడ్నాప్‌లు, దోపిడీలే

పాట్నా : బీహార్‌లో అధికారం కోసం ఎన్డీఏ కూటమి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఆ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. ఎన్డీయేత‌ర పార్టీల‌పై బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ప్ర‌ధానంగా రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)ని టార్గెట్ చేసి ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్నారు. 

ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మ‌హారాష్ర్ట మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మాట్లాడుతూ.. బీహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే కిడ్నాప్‌లు, దోపిడీలే అధిక‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు మొద‌టి కేబినెట్‌లోనే ఆమోదిస్తామ‌ని తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌క‌టించారు. కానీ ఆ ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు కేవ‌లం క్రిమిన‌ల్స్‌కే అని ఫ‌డ్న‌వీస్ తెలిపారు. 10 ల‌క్ష‌ల దేశీయ తుపాకుల‌కు ఆర్డ‌ర్స్ ఇచ్చి.. నేరాల‌ను ప్రోత్స‌హిస్తార‌ని ఆరోపించారు. బీహార్‌లో మ‌ళ్లీ కిడ్నాప్‌లు, దోపిడీలు, దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు, అత్యాచారాలు చూడ‌క త‌ప్ప‌ద‌న్నారు.  

లాలు ప్ర‌సాద్ యాద‌వ్ పాల‌న‌లో బాలిక‌లు బ‌య‌ట‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డేవారు. అంత క్రూరంగా వారి పాల‌న కొన‌సాగింది. విద్యుత్‌, తాగునీటి విష‌యంలో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఎన్డీఏ ప్ర‌భుత్వం బీహార్ ప్ర‌జ‌ల‌కు అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పించింద‌ని ఫ‌డ్న‌వీస్ గుర్తు చేశారు. అన్ని గ్రామాల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు.  


logo