సోమవారం 30 మార్చి 2020
National - Mar 13, 2020 , 16:46:28

ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. 16వ తేదీనాడు పార్లమెంట్‌ అన్ని ఆర్థిక బిల్లులు ఆమోదించనుంది. మంగళవారం చర్చ అనంతరం ఆర్థిక బిల్లులు ఆమోదానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు సభ్యులందరూ సభకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా పేర్కొంటూ మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది. కరోనావైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేసే ప్రతిపాదనేది లేదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు.


logo