బుధవారం 03 జూన్ 2020
National - Feb 05, 2020 , 02:01:59

దుశ్శాసనుల పార్టీ బీజేపీ: మమత

దుశ్శాసనుల పార్టీ బీజేపీ: మమత

బోంగావ్‌/ రణఘాట్‌: బీజేపీ దుశ్శాసనుల పార్టీ అని, తుగ్లక్‌ విధానాలను అమలు చేస్తున్నదని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై దేశద్రోహులుగా ముద్ర వేయడాన్ని ఆమె ఖండించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపి, నిరసనకారులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. మంగళవారం రాష్ట్రంలో జరిగిన సీఏఏ-ఎన్నార్సీ వ్యతిరేకంగా జరిగిన సభల్లో ఆమె మాట్లాడుతూ బలవంతంగా సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ అమలుకు కేంద్రం పూనుకుంటున్నదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో వీటిని అమలు చేయబోనన్నారు. 


logo