శనివారం 28 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 16:17:06

ఓట‌మి ఖాయ‌మ‌వ‌డంతో ఇండింపెండెంట్ల‌కు బీజేపీ వ‌ల: క‌మ‌ల్‌నాథ్‌‌

ఓట‌మి ఖాయ‌మ‌వ‌డంతో ఇండింపెండెంట్ల‌కు బీజేపీ వ‌ల: క‌మ‌ల్‌నాథ్‌‌

భోపాల్‌: ఇటీవ‌ల ముగిసిన ఉపఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు విశాల హృద‌యంతో నీతి, నిజాయితీల‌కు ఓటేశార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే గ్ర‌హించార‌ని, అందుకే అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం హార్స్ ట్రేడింగ్ మొద‌లుపెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ల‌క్ష్యంగా బీజేపీ బేర‌సారాలు చేస్తున్న‌ద‌ని క‌మ‌ల్‌నాథ్ మండిప‌డ్డారు. ఇప్ప‌టికే చాలా మంది ఇండిపెండెంట్ల‌ను బీజేపీ సంప్ర‌దించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని చెప్పారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.