గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 19:27:31

‘బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టే పనిలో ఉంది’

‘బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టే పనిలో ఉంది’

భోపాల్‌: బీజేపీ పార్టీ ప్రజాస్వామ్య ఏర్పడిన ప్రభుత్వాలను పడగట్టే పనిలో బిజీగా ఉందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న చర్యలను మేం అడ్డుకుంటున్నాం. కాంగ్రెస్‌లో గొప్ప భవిష్యత్‌ ఉన్న  జ్యోతిరాధిత్య సింధియా బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేస్తారని ఎప్పుడూ ఊహించలేదని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. బెంగళూరులోని రమాడా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టు లో పిల్‌ దాఖలు చేసినట్లు మీడియాతో అన్నారు. 

దిగ్విజయ్‌ సింగ్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు  రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.   రమాడా హోటల్‌లో  బస చేస్తున్న  22 మంది అసంతృప్త ఎమ్మెల్యేలను కలిసేందుకు దిగ్విజయ్‌ సింగ్‌, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెళ్లగా.. దిగ్విజయ్‌ సింగ్‌, శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హోటల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దిగ్విజయ్‌, శివకుమార్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 


logo