ఆదివారం 24 జనవరి 2021
National - Nov 26, 2020 , 17:52:04

బీజేపీకి బెంగాల్‌లో చోటే లేదు: మ‌మ‌తాబెన‌ర్జి

బీజేపీకి బెంగాల్‌లో చోటే లేదు: మ‌మ‌తాబెన‌ర్జి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ మీద మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీకి చోటే లేద‌ని, అది బ‌య‌టి వ్య‌క్తుల పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప‌శ్చిమబెంగాల్‌ను గుజ‌రాత్‌లా మారుస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నార‌ని, కానీ తాను ఎప్పటికీ అల్ల‌ర్ల మ‌య‌మైన గుజ‌రాత్‌లా బెంగాల్‌ను మార‌నివ్వ‌న‌ని మ‌మ‌త‌ మండిప‌డ్డారు.

దేశ స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నా కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షా మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌ల ప్రచారాల‌తో బిజీబిజీగా ఉంటున్నార‌ని మ‌మతాబెన‌ర్జి ఎద్దేవా చేశారు. త‌న కెరీర్ మొత్తంలో ఇలాంటి హోంమంత్రిని ఎప్పుడూ చూడ‌లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌ల జ‌రిగానా అక్క‌డికి స్వ‌యంగా హోంమంత్రే ప్రచారానికి వెళ్తుండ‌టం విచిత్రంగా ఉంద‌న్నారు. కోల్‌క‌తాలో ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ మ‌మ‌తాబెన‌ర్జి ఈ వ్యాఖ్య‌లు చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo