గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 16:07:00

సొంత భూమిలో రైతులే కూలీలుగా మారుతారు : అఖిలేశ్‌ యాదవ్‌

సొంత భూమిలో రైతులే కూలీలుగా మారుతారు : అఖిలేశ్‌ యాదవ్‌

న్యూఢిల్లీ : వ్యవసాయానికి సంబంధించి మూడు దోపిడీ బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, అవి రైతులను తమ సొంత భూమిలోనే కూలీలుగా మారుస్తుందని సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం అన్నారు. దోపిడీ బిల్లులు రైతులను తమ పొలాలు ధనవంతులకు తనఖా పెట్టిస్తాయని చెప్పారు. ‘బిజెపి ప్రభుత్వం ఒక దోపిడీ బిల్లును తీసుకువచ్చింది, ఇది రైతులు తమ పొలాలను ధనవంతులకు తనఖా పెట్టేలా చేస్తుంది. ఇది పొలాల సరిహద్దులను విచ్ఛిన్నం చేయడానికి, ఎంఎస్‌పీని నిర్ణయించే మార్కెట్లను అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని’ ట్వీట్‌ చేశారు. పంజాబ్‌లోని రైతులు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను రైతులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత-రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో వాయిస్‌ ఓటు ద్వారా ఆమోదించగా.. వాటిని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo