గురువారం 28 మే 2020
National - May 06, 2020 , 20:15:09

బీజేపీ ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీల‌ను బానిస‌లుగా చూస్తోంది...

బీజేపీ ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీల‌ను బానిస‌లుగా చూస్తోంది...

న్యూఢిల్లీ: క‌ర్ణాట‌క‌లోని బీజేపీ ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీల‌ను మ‌ధ్య‌యుగ‌పు అనాగ‌రిక‌మైన బానిసలుగా చూస్తోందిని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏచూరి సీతారం మండిపడ్డారు. వ‌ల‌స కార్మికులు రాష్ట్రం విడిచి వెళ్లిపోతే నిర్మాణ‌రంగం పూర్తిగా దెబ్బ‌తింటుంద‌ని దేశంలోని వివిధ ప్రాంతాల‌కు వెళ్లే వ‌ల‌స కార్మికుల‌ను ఎక్క‌డివారిని అక్క‌డే ఆపేయాల‌ని య‌డ్యుర‌ప్ప ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. బిల్డ‌ర్లు, కాంట్రాక్ట‌ర్లు ముఖ్య‌మంత్రిని క‌లిసి నిర్మాణ‌రంగం అవ‌స్థ‌ల గురించి వివ‌రించ‌గానే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు రైళ్లు న‌డ‌పాల‌ని మొద‌ట విజ్ఞ‌ప్తి చేసిన క‌ర్ణాట‌క స‌ర్కారు, అనంత‌రం ఈ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుంది. దీనిపై ఏచూరిసీతారాం మాట్లాడుతూ... వారిని బాండెడ్ లేబ‌ర్‌గా భావించ‌డం దారుణం. భార‌త‌రాజ్యంగం ఈ వ్య‌వ‌స్థ‌ను ఎప్పుడో నిషేదించింది. బీజేపీ రాష్ట్ర ప్ర‌భుత్వం వారిని మ‌ధ్య‌యుగ‌పు బానిస వ్య‌వ‌స్థ‌లోని తీసుకెళుతుంద‌ని, ఈ చ‌ర్య‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని ట్విట్ చేశారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో వారి ప‌నిప్ర‌దేశాల్లో చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు శ్రామిక్ స్పెషల్ రైళ్లు న‌డిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రైల్వేశాఖ 115 రైళ్లు న‌డిపింది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు రెవెన్యూశాఖ కార్య‌ద‌ర్శి ఎన్ మంజునాథ ప్ర‌సాద్ నోడ‌ల్ అధికారిగా ఉన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న త‌మ రాష్ట్రంలో ఉన్న వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు రైళ్లు న‌డ‌పాల‌ని రైల్వే శాఖ‌కు లేఖ రాశారు. అనంత‌రం కొద్ది గంట‌ల‌కే త‌మ‌కు ప్ర‌త్యేక రైళ్లు అవ‌స‌రం లేద‌ని మ‌రో లేఖ రాశారు. కార్మికులు రాష్ట్రం నుంచి వెళ్లిపోకుండా చూడాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతోనే మంజునాథ ఈ లేఖ రాసిన‌ట్లు స‌మాచారం.


logo