బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 10:23:58

పుంజుకున్న బీజేపీ.. కాంగ్రెస్ డ‌కౌట్ !

పుంజుకున్న బీజేపీ.. కాంగ్రెస్ డ‌కౌట్ !

హైద‌రాబాద్‌:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డుతున్నాయి. ఇవాళ కౌంటింగ్ జ‌రుగుతున్న‌ది.  అయితే 2015తో పోలిస్తే.. ఈ సారి బీజేపీ త‌న సీట్ల సంఖ్య‌ను పెంచుకున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు.. క‌మ‌లం పార్టీ సుమారు 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది.  ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 46 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  70 అసెంబ్లీ స్థానాల్లో.. మ్యాజిక్ మార్క్ 35 దాటితే స‌రిపోతుంది.  తాజా లెక్క‌ల ప్ర‌కారం ఆధిక్యంలో ఆప్ దూసుకువెళ్తుతున్న‌ది.  గ‌తంలో 3 సీట్లే గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆప్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌ల్లంతులేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో లేనట్లు ప్రాథ‌మిక ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి.  వ‌రుస‌గా మూడ‌వ‌సారి కేజ్రీవాల్ .. సీఎం కానున్నారు. 


logo
>>>>>>