శనివారం 16 జనవరి 2021
National - Jan 04, 2021 , 18:07:10

తమిళనాడు ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

తమిళనాడు ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

చెన్నై : త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికలకు బీజేపీ  సమాయత్తమైంది. అందరికన్నా ముందుకుగా తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. తొలి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. కాగా, బీజేపీ జాబితాలో ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బు, స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణిలకు బెర్తులు కన్‌ఫార్మ్‌ అయినట్లుగా తెలుస్తున్నది. వీరిద్దరూ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలీవలనే బీజేపీలో చేరిన టీమిండియా మాజీ పేసర్‌ ఎల్‌ శివరామకృష్ణన్‌ కూడా చెన్నై నగరంలోని ఒక అసెంబ్లీ స్థానం  నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌.. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో ఉండగా అస్వస్థులయ్యారు. దాంతో ఆయన రెండు రోజుల పాటు దవాఖానాలో చికిత్స పొందారు. డిశ్చార్జ్‌ అయి తమిళనాడు వెళ్లిన తర్వాత కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు రాజకీయాల్లోకి ఆరంగేట్రంను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అటు మరో నటుడు కమల్‌హాసన్‌ పార్టీని ఏర్పాటుచేసుకుని రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. డీఎంకే నుంబి బహిష్కృతుడైన అళగిరి.. త్వరలోనే ప్రాంతీయ పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించడంతో తమిళనాడు రాజకీయాలు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే వేడెక్కాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.