బీజేపీ రైతు విరోధి.. ధనిక పక్షపాతి: అఖిలేష్ యాదవ్

లక్నో: అధికార బీజేపీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు రైతుల కంటే తనకు ధనవంతులే ఎక్కువ అన్నట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రజా పక్షపాతిగా కాకుండా ధనిక పక్షపాతిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అందుకే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం ధనవంతులైన పెట్టుబడిదారుల కోసం రైతుల ప్రయోజనాలను ప్రమాదంలో పడేసిందని విమర్శించారు.
దేశ జనభాలో మూడింట రెండొంతులు ఉన్న రైతులకు బీజేపీ సర్కారు హాని తలపెట్టిందని, వారు పోరుబాట పడితే ఏనాడు ఓటమిని అంగీకరించలేదనే విషయాన్ని మోదీ ప్రభుత్వం మరిచినట్టుందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. అఖిలేష్ యాదవ్ గతంలో కూడా మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పెట్టుబడిదారులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.