మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 16:22:39

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన

జైపూర్‌:  రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో మొదలైన సంక్షోభం కొనసాగుతోంది.  జైపూర్‌లోని ఓ హోటల్‌లో సీఎల్పీ భేటీ ముగిసింది.  అవసరమైతే రాష్ట్రపతి భవన్‌ ముందు ధర్నా చేయాలని సీఎం అశోక్‌  గెహ్లాట్‌ నిర్ణయించారు.  ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా   ఉండాలని పిలుపునిచ్చారు.  అవసరమైతే రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని గెహ్లాట్‌ తెలిపారు. కాసేపట్లో సీఎం గెహ్లాట్‌ గవర్నర్‌ను కలవనున్నారు. రాజస్థాన్‌లో   కాంగ్రెస్‌ నేతృత్వంలోని   ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు  వైభవ్‌  ఆరోపించారు. ఈ నేపథ్యంలోని బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. 

'ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  కుట్ర పన్నుతోంది. గత ఏడాదిన్నర కాలంలో రైతులను ఆదుకోవడంతో పాటు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఎంతో గొప్పగా పనిచేశాం. మధ్యప్రదేశ్‌, కర్ణాటకలోని ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, రాజస్థాన్‌లో అలా జరగదు.  రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఐకమత్యంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న వారి కలనెరవేరదు' అని వైభవ్‌  కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 


logo