గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 18:54:49

బీజేడీ సీనియ‌ర్ నేత సుభాష్ చౌహాన్ మృతి

బీజేడీ సీనియ‌ర్ నేత సుభాష్ చౌహాన్ మృతి

భువ‌నేశ్వ‌ర్‌: బిజూ జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నేత, పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలి చైర్మన్ సుభాష్ చౌహాన్ (54) ఈ రోజు ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో కన్నుమూశారు. కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న‌ట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీతో చౌహాన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. భజరంగ్‌ద‌ళ్‌ మాజీ కన్వీనర్ అయిన చౌహాన్ బీజేపీకి రాజీనామా చేసి 2019 ఎన్నికలకు ముందు బీజేడీలో చేరారు. అనంత‌రం గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ప‌శ్చిమ ఒడిశా అభివృద్ది మండ‌లి చైర్మన్‌గా నియమితులయ్యారు. చౌహాన్ మరణానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ సారంగి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. 


logo