శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 19:40:05

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేడీ

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేడీ

భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బీజేడీ(బిజూ జనతా దళ్‌) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. వారిలో సుభాష్‌ సింగ్‌, మునా ఖాన్‌, సుజీత్‌ కుమార్‌, మమతా మహంతా ఉన్నారు. కాగా, ఏప్రిల్‌ నెలలో 17 రాష్ర్టాల్లోని 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్నది. అందులో ఒడిషా నుంచి 4 స్ధానాలు ఖాళీ అవనున్నాయి. బీజేడి రాజ్యసభ సభ్యులు అనుభవ్‌ మహంతి, నరేంద్ర స్వైన్‌, సరోజిని హెంబ్రామ్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీ రంజీబ్‌ బిశ్వాల్‌ ల పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియనున్నది. ఈసీఐ(ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) శుక్రవారం.. 17 రాష్ర్టాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పెద్దలసభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు:

* ఎన్నిక జరుగు స్థానాలు-55

* ఎలక్షన్‌ నోటిఫికేషన్‌-మార్చి 6

* నామినేషన్లకు చివరి తేది-మార్చి 13

* నామినేషన్ల పరిశీలన- మార్చి 16

* నామినేషన్‌ విత్‌డ్రా చివరి తేదీ- మార్చి 18

* ఎలక్షన్‌ తేది, ఫలితాలు విడుదల- మార్చి 26


logo