మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 13:47:14

'లూడో గేమ్'‌లో ఓడించాడ‌ని తండ్రిపై కేసు.. కూతురి నిర్వాకం!

'లూడో గేమ్'‌లో ఓడించాడ‌ని తండ్రిపై కేసు.. కూతురి నిర్వాకం!

ఈమ‌ధ్య లాయ‌ర్లు వింత వింత కేసులు స్వీక‌రించాల్సి వ‌స్తోంది. పోయిన నెల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభాల్ జిల్లాకు చెందిన ఒక మ‌హిళ వివాహం అయిన 18 నెల‌ల త‌ర్వాత త‌న భ‌ర్త నుంచి విడాకులు కావాల‌ని కోరింది. త‌న మీద భ‌ర్త ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. అది భ‌రించ‌లేక‌పోతున్నా అనే కార‌ణాన్ని చెప్పుకొచ్చింది. దీంతో కోర్టు మ‌తాధికారి అవాక్కై కేసును కొట్టేశారు. ఇప్పుడు ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. భోపాల్‌కు చెందిన 24 ఏండ్ల మ‌హిళ లూడో ఆట‌లో త‌న తండ్రి చాలాసార్లు ఓడించాడ‌నే కోపంతో కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు స‌మాచారం.

లాక్‌డౌన్ స‌మ‌యంలో కుమార్తెతో పాటు మ‌రో ఇద్ద‌రు తోబుట్టువులు త‌మ తండ్రితో లూడో ఆడారు. అందులో ఆ మ‌హిళ చాలా ఆట‌లు ఓడిపోయింది. దీంతో తండ్రిపై ఆగ్ర‌హం పెంచుకున్న‌ది. విచిత్రం ఏంటంటే.. కొంత‌కాలానికి కోపం ఎక్కువై స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఫ్యామిలీ కోర్టు కౌన్సెల‌ర్‌ను సంప్ర‌దించింది.  'ఈ రోజుల్లో పిల్ల‌లు ఓట‌మిని భ‌రించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి కేసుల వెనుక ఉన్న కార‌ణం అదే' అని కుటుంబ కోర్టు కౌన్సిల‌ర్ స‌రితా ర‌జ‌ని చెప్పుకొచ్చారు. గెలుపుతో పాటు ఓట‌మిని అంగీక‌రించ‌డం నేర్చుకోవాలి. అది గెలిచినంత ముఖ్య‌మైన‌దంటున్న‌ది స‌రితా. ముగ్గురు తోబుట్టువుల‌లో ఈ మ‌హిళ చిన్న‌ది. ప్ర‌స్తుతం భోపాల్‌లో చ‌దువుతోంది. 


logo