గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 19:14:57

ఇంట్లో తిడ‌తార‌ని 'నోట్లో ట్యాటు' వేయించుకుంటున్న యువ‌త‌!

ఇంట్లో తిడ‌తార‌ని 'నోట్లో ట్యాటు' వేయించుకుంటున్న యువ‌త‌!

లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వింత‌లు, విశేషాలు చూస్తునే ఉన్నాం. అయితే ఇది వీట‌న్నిక‌న్నా కాస్త భిన్నంగా ఉంటుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వింతైన ధోర‌ణి మ‌రేంటో కాదు ట్యాటూనే. ఈ రోజుల్లో ట్యాటు అంటే స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఫ్యాష‌న్‌లో భాగంగా ట్యాటు వేపించుకోవ‌డానికి యువ‌త ముందుంటుంది. చేతికి పిచ్చిగీత‌లు ఎందుకు అంటూ పేరెంట్స్ పోరు ప్ర‌తి ఇంట్లో ఉంటుంది.

ట్యాటు మీద ఉన్న మోజు, ఇంట్లో వారి నుంచి తిట్లు రెండింటినీ క‌వ‌ర్ చేయ‌డానికి ఇలా కొత్త ప్ర‌దేశాన్ని ఎంచుకుంటున్నారు నేటి త‌రం. ఇదివ‌ర‌కు హీరోయిన్లు నాలుక‌, పెద‌వుల మీద రింగ్ కుట్టించుకుంటేనే అమ్మో అంత నొప్పిని ఎలా భ‌రించారు అనుకున్నారు. ఇప్పుడు వీరు మాత్రం ట్యాటూని అంగిట్లో వేపించుకుంటున్నారు. ఈ ట్యాటు వేయ‌డానికి క‌నీసం 20 నిమిషాలు ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కు ఆ నొప్పిని భ‌రించాల్సిందే. ఈ ట్యాటూలు వేసేది ఇట‌లీకి చెందిన ఫ్లోరెన్స్ నివాసి మాటియో మాసిని. ఇత‌ను ఎక్క‌డైనా ట్యాటు అల‌వోక‌గా వేయ‌గ‌ల‌డు. ఈ ఆరేండ్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10కి పైగానే నోట్లో ప‌చ్చ‌బొట్లు వేశాడ‌ని చెబుతున్నాడు. నోటిని బ‌ట్టి ట్యాటు వేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. దీనికి అంత‌గా బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చెబుతున్నాడు. ఏం ఫ్యాష‌నో ఏమో.. దీనికోసం యువ‌త ఏమైనా చేసేలా ఉన్నారు. 


   


logo