మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 18:00:19

ఇంటి త‌లుపు తెర‌వగానే.. మ‌హిళ త‌ల‌మీద పాము!

ఇంటి త‌లుపు తెర‌వగానే.. మ‌హిళ త‌ల‌మీద పాము!

సాధార‌ణంగా కొన్ని రోజులు త‌ర్వాత ఇంటి త‌లుపు తెర‌వ‌గానే ఏ బ‌ల్లో, బొద్దింకో పైన ప‌డుతుంది. కానీ ఈ మ‌హిళ త‌ల‌మీద పాము ప‌డింది. మిస్సిస్సిప్పిలోని మిచెల్ అనే మ‌హిళ ఆఫీస్ వ‌ర్క్ మీద కొన్ని రోజులు ఇంటికి రాలేదు. వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాత ఇంటికి చేరుకొని త‌లుపు తెరిచింది. ఇంట్లో అడుగు పెట్ట‌గానే పై నుంచి ఏదో ప‌డింది. తీరా కింద చూస్తే కాళ్ల మీద నుంచి పాము వెళ్లింది.

దీంతో ఆమె గుండె ఆగినంత ప‌నైంది. భ‌యంతో వంట‌గ‌దిలోకి ప‌రుగులు తీసింది మ‌హిళ‌. వెంట‌నే త‌న భ‌ర్త‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పి ఇంటికి పిలిచింది. అప్ప‌టివ‌ర‌కు ఆమె ఖాళీగా ఉండ‌కుండా చీపురు ప‌ట్టుకొని పామును బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టింది. మిచెల్ పామును చూడ‌గానే భ‌య‌ప‌డిన‌ప్ప‌టికీ ఆమెకు పాములంటే ఇష్ట‌మే. అందుకే ఈ పామును చంపడానికి ప్ర‌య‌త్నించ‌లేదు. పాములు చాలా మ‌నోహ‌రంగా ఉంటాయి అని మిచెల్ చెప్పుకొచ్చింది. అయితే ఇది విషం లేని పాము అవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. 


logo