శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 14:58:20

చికెన్ కేఎఫ్‌సీతో చేసిన చెప్పులు.. ఇవి చాలా స్పెష‌ల్ గురూ!

చికెన్ కేఎఫ్‌సీతో చేసిన చెప్పులు.. ఇవి చాలా స్పెష‌ల్ గురూ!

ఎన్ని ర‌కాల చెప్పులు ఉన్న‌ప్ప‌టికీ మార్కెట్‌లోకి కొత్త‌గా ఏదోర‌కం చెప్పులు వ‌స్తూనే ఉంటాయి. ముందు బూట్లు మాదిరిగా, వెనుక బెల్టు, పైన రంధ్రాలు ఉండే చెప్పు‌ల‌ను యువ‌త‌రం బాగా ఇష్ట‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల క్రోక్స్ వారి కొత్త ఎడిష‌న్ క్లాగ్స్‌ను విడుద‌ల చేసింది. ఇది వేయించిన చికెన్ లాగ క‌నిపిస్తుంది.

కేఎఫ్‌సీతో క‌లిసి కేఎఫ్‌సీ క్లాగ్స్ అని పిలువ‌బ‌డే కొత్త పాద‌ర‌క్ష‌ల ఎడిష‌న్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఈ పాద‌ర‌క్ష‌ల బ్రాండ్ కొన్నిరోజుల క్రితం త‌మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వార్తను ప్ర‌క‌టించింది. "ఈ సామెత నిజం, మంచి విషయాలు, వేయించిన చికెన్ లాగా కనిపించే క్రోక్స్ వేచి ఉన్నవారికి వస్తాయి" అని క్రోక్స్ శీర్షిక‌లో తెలియ‌జేసింది. చికెన్ ప్రింట్‌, చార‌ల ఎరుపు, తెలుపు రంగులో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 

 

 


logo