గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 18:19:10

కెమేరా ఇంటిగ్రేటెడ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైస్‌ను కనుగొన్న బీటెక్‌ విద్యార్థి

కెమేరా ఇంటిగ్రేటెడ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైస్‌ను కనుగొన్న బీటెక్‌ విద్యార్థి

కొచ్చి : కేరళలోని కొచ్చిలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆటోమెటిక్‌గా శరీర ఉష్ణోగ్రతను తెలియజేసే డివైస్‌ను కనుగొన్నాడు. యావత్‌ ప్రంపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 రోగులకు చికిత్స అందజేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది కోసం ఈ డివైస్‌ను కనుగొన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు. దీని ద్వారా వ్యాధి సోకిన వారిని దాదాపుగా గుర్తించవచ్చునని పేర్కొన్నాడు. 

ఈ యంత్రంలోని పరారుణ సెన్సార్లు మానవ స్వభావాన్ని గ్రహించగలవు. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా ఉంటే వెంటనే యంత్రం ఆటోమెటిక్‌గా ఫొటో తీసి దానికి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ సర్వర్‌లోకి వైఫై ద్వారా పంపుతుంది.  

కేరళ రాష్ట్రం కక్కనాడ్‌లోని కొచ్చి రాజగిరి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చివరి సంవత్సరం చదువుతున్న డివిన్స్‌ మ్యాథ్యూ అనే విద్యార్థి దీన్ని డెవలప్‌ చేశాడు. అదే కళాశాలలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ స్మిను ఇసుధీన్‌ మ్యాథ్యుకు డివైస్‌ తయారీలో సాయం చేశారు. శరీరాన్ని ముట్టుకోకుండా బాడీ టెంపరేచర్‌ను దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ డివైస్‌ను తయారు చేయడానికి కొన్ని వారాల సమయం పట్టిందని విద్యార్థి తెలియజేశాడు. దీన్ని రూ.4వేలకు విక్రయించనున్నట్లు పేర్కొన్నాడు. డాక్టర్‌ ఇసుధీన్‌ ప్రోత్సహించడం వల్లే ఈ డివైస్‌ తయారీ సులభమైందని తెలిపాడు. 

ఆరోగ్య సిబ్బంది ఈ డివైస్‌ను మనుషులకు దగ్గరగా కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. డివైస్‌ కొన్ని సందేశాలను కూడా విడుదల చేస్తుంది. ‘వైద్యుడిని సంప్రదించండి, మీరు క్షేమంగానే ఉన్నారు..’ వంటి సందేశాలు శరీర ఉష్ణోగ్రతను బట్టి డివైస్‌ ద్వారా వస్తుంటాయి.  


logo