శనివారం 23 జనవరి 2021
National - Nov 28, 2020 , 13:32:48

క‌చ్చితంగా ఆ హెల్మెట్లే కొనాలి!

క‌చ్చితంగా ఆ హెల్మెట్లే కొనాలి!

న్యూఢిల్లీ: బ‌్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) స‌ర్టిఫైడ్ చేసిన హెల్మెట్ల‌నే వాహ‌న‌దారులు కొనుగోలు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల‌ను నాణ్య‌త లేని హెల్మెట్ల వాడ‌కాన్ని నిరోధిస్తుంద‌ని, మంచి నాణ్య‌త క‌లిగిన హెల్మెట్లు వాహ‌న‌దారుల‌ను ప్ర‌మాదం నుంచి ర‌క్షిస్తాయ‌ని స‌ద‌రు మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు త‌గిన హెల్మెట్ల వాడ‌కానికి సంబంధించి సుప్రీంకోర్టు క‌మిటీ ఇచ్చిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డానికి మ‌రో క‌మిటీని ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇందులో బీఐఎస్‌, ఎయిమ్స్‌లాంటి సంస్థ‌ల నుంచి నిపుణులు ఉన్నారు. ఈ క‌మిటీ తేలికైన హెల్మెట్లు వాడాల‌ని సిఫార‌సు చేసింది. బీఐఎస్ స‌ర్టిఫైడ్ హెల్మెట్ల‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ రోడ్ ఫెడ‌రేష‌న్ స్వాగ‌తించింది. ఒక‌సారి ఈ నోటిఫికేష‌న్ అమల్లోకి వ‌చ్చిన త‌ర్వాత బీఐఎస్ స‌ర్టిఫైడ్ లేని హెల్మెట్ల వాడ‌కం నేర‌మ‌వుతుంది అని ఈ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు కేకే క‌పిల అన్నారు. 


logo