e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Entertainment స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

న్యూఢిల్లీ: భార‌త సినీ రంగంలో పేరెన్నిక‌గ‌న్న సినీ నేప‌థ్య గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యం.. స‌క‌ల క‌ళ‌లు క‌ల‌బోసిన కంఠం ఈ గాన గంధ‌ర్వుడిది. ఏ పాట పాడినా అమృతమే.. కానీ విధి ఆడే వింత నాట‌కం ఎవ‌రినైనా మింగేస్తుంది.

క‌రోనా మ‌హ‌మ్మారితో గ‌తేడాది ఆగ‌స్టు ఐదో తేదీన 74వ ఏట ఎస్పీ బాలు క‌న్నుమూశారు. బాలీవుడ్‌లోనూ త‌న మార్క్ చూపిన బాలు గారూ దాదాపు ద‌శాబ్ధం పాటు స‌ల్మాన్‌ఖాన్‌కు ఒక‌టి కంటే ఎక్కువ పాట‌లు పాడారు.

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

మైనే ప్యార్ కియా సినిమాలో దిల్ దివానా అనే గేయాన్ని ఆలాపించినందుకు ఎస్పీ బాలు.. ఫిలిం ఫేర్ ఉత్త‌మ పురుష సినీ నేప‌థ్య గాయ‌కుడి అవార్డు అందుకున్నారు. హ‌మ్ అప్నే హై కౌన్ సినిమాలో ల‌తా మంగేశ్వ‌ర్‌తో క‌లిసి ఆలాపించిన గేయం దీదీ తెరా దివార్ దివానా ఇప్ప‌టికీ అంద‌రి నోళ్ల‌లోనే ఉంది.

ఒక‌నాడు రాజేశ్ ఖ‌న్నాకు వాయిస్ ఓవ‌ర్‌గా కిశోర్ కుమార్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లే స‌ల్మాన్‌ఖాన్‌కు వాయిస్‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం పేరు సంపాదించుకున్నారు. శుక్ర‌వారం (జూన్ 4) ఆయ‌న జ‌యంతి.

ఎస్పీ బాలు జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ కొన్ని జ్ఞాప‌కాలు గుర్తు చేసుకుందాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరులో 1946 జూన్ 4న జ‌న్మించారు. ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా సినీ రంగంలో అడుగు పెట్టిన 16 ఏండ్ల‌కు 1980లో శంక‌రాభ‌ర‌ణం సినిమాలో ఆయ‌న ఆలాపించిన గేయాల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపునిచ్చింది.

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

శంక‌రాభ‌ర‌ణం సినిమాలో గేయాలు ఆలాపించినందుకు ఎస్పీ బాలు తొలిసారి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అంత‌కుముందు 1969లో తొలిసారి అరిక‌యి ఎన్నుమ్ ఇలాయ క‌న్నీ అనే త‌మిళ గేయం ఆలాపించే అవ‌కాశం బాలుకు ల‌భించింది. ఇందులో జెమినీ గ‌ణేశన్ కూడా న‌టించారు.

ద‌క్షిణ భార‌త‌దేశంలోనే పేరు ప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్న సినీ న‌టుడు ఎంజీ రామ‌చంద్ర‌న్‌. ఆయ‌నతోపాటు జ‌య‌ల‌లిత న‌టించిన ఇర‌మ్ నిల‌వె వా సినిమాలో గేయాలు ఆలాపించే అవ‌కాశం బాలుకు వ‌చ్చింది. కానీ ఆ స‌మ‌యంలో టైఫాయిడ్ బారిన ప‌డ్డారు.

ఈ ప‌రిణామం నిరాశ ప‌రిచినా ఎంజీఆర్ వెన‌క్కు త‌గ్గ‌లేద‌ట‌. టైఫాయిడ్ నుంచి కోలుకున్నాక బాలుతోనే పాడించాల‌నుకున్నార‌ట‌. బాలు కోలుకున్నాక జైపూర్‌లో ఈ గేయాన్ని ఆలాపించారు.

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

ఎస్పీ బాలు వివిధ భాష‌ల సినిమాల్లో 50 ఏండ్ల‌లో 40 వేల గేయాల‌ను ఆలాపించారు. క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు ఉపేంద్ర కుమార్ కోసం 12 గంట‌ల్లో 21 గేయాలు ఆలాపించారు. ఇందుకు ఎస్పీ బాలుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ల‌భించింది.

ఒకానొక ద‌శ‌లో ఎస్పీ బాలు ఒక‌రోజులోనే ప‌లు భాష‌ల్లో 16-16 గేయాలు ఆలాపించారు. 17 గంట‌ల పాటు నిరంత‌రాయంగా గేయాలు ఆలాపించాల్సి వ‌చ్చింది.

స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

రోజా సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్‌తో క‌లిసి ఎస్పీ బాలు ప‌ని చేశారు. మూడు వ‌ర్ష‌న్ల సినిమాకూ ఆయ‌నే గేయాలు ఆలాపించారు. ప‌లు సినిమాల‌కు ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేశారు. సింగ‌ర్‌తోపాటు 40కి పైగా ప‌లు భాషా చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా బాలు వ్య‌వ‌హ‌రించారు.

బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌కు వాయిస్ ఇచ్చేందుకు 1990వ ద‌శ‌కంలో గేయాలాప‌న‌కు బ్రేక్ ఇచ్చారు. సినిమాల్లో న‌టించేందుకు పూర్తి టైం కేటాయించ‌డానికి ప్ర‌య‌త్నించారు. 72 త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ భాషా చిత్రాల్లో న‌టించారు.

15 ఏండ్ల విరామం త‌ర్వాత చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా కోసం 2013లో ఆలాపించారు. క‌ళా రంగానికి అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా కేంద్ర ప్ర‌భుత్వం 2011లో ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్కారంతో ఎస్పీ బాలును గౌర‌వించింది.

ఇవి కూడా చ‌దవండి:

ఇలాగైతే 2025 నాటికే అంద‌రికీ వ్యాక్సిన్ : శివ‌సేన‌

కేఎస్ఆర్టీసీ ఇక కేర‌ళ‌దే.. క‌ర్ణాట‌క‌కు షాక్‌

కశ్మీర్‌ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..

ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

జీన్స్‌, టీషర్ట్స్ వేసుకోవ‌ద్దు.. సీబీఐ అధికారుల‌కు కొత్త డైరెక్ట‌ర్ ఆదేశాలు

ఆ వేరియంట్ వ‌ల్లే ఇండియాలో క‌రోనా సెకండ్ వేవ్‌: ప్ర‌భుత్వ అధ్య‌య‌నం

అత్యంత అంద‌విహీన‌మైన భాష క‌న్న‌డ అన్న గూగుల్‌.. క్ష‌మాప‌ణ చెప్పిన సంస్థ‌

కోవిన్‌ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడ‌కానికి ద‌ర‌ఖాస్తు

పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..

ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరు : ప్ర‌భుత్వ విప్ గువ్వ‌ల‌

రూ.43000 కోట్ల‌తో ఆరు స‌బ్‌మెరైన్ల నిర్మాణానికి ఆమోదం

వ్యాక్సిన్ వేసుకున్న వారికి క‌రోనా వ‌చ్చినా చ‌నిపోలేదు: ఎయిమ్స్ అధ్య‌య‌నం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స‌ల్మాన్‌కు ఎస్పీ వాయిస్‌.. గాన గంధ‌ర్వుడి జ‌యంతినేడు

ట్రెండింగ్‌

Advertisement