శనివారం 28 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 12:40:16

స్ఫూర్తి ప్రధాత బిర్సా ముండా : ప్రధాని మోదీ

స్ఫూర్తి ప్రధాత బిర్సా ముండా : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : బిహార్‌ దివగంత గిరిజన నాయకుడు భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ‘స్వాతంత్య్ర ఉద్యమంలో, సామాజిక సామరస్య సాధనకు బిర్సా ముండా ఎనలేని కృషి చేశారు. సమాజంలో పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధికి శ్రమించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’ అని  ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ముండా గిరిజన తెగకు చెందిన బిర్సా ముండా 1875 నవంబర్‌ 15న బిహార్‌లో జన్మించారు.

19వ దశకంలో బ్రిటీషర్ల పాలనలో నేటి బిహార్‌-జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన జాతి పరమైన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. బిర్సా ముండా జయంతి రోజే యాధృశ్చికంగా జార్ఖండ్‌ అవతరణ దినోత్సవం  కూడా. ఉదయం ప్రధాని మోదీ జార్ఖండ్‌ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం  శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.