శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 21:28:08

ప‌క్షి ఢీకొన‌డంతో తిరిగివ‌చ్చిన విమానం

ప‌క్షి ఢీకొన‌డంతో తిరిగివ‌చ్చిన విమానం

ఢిల్లీ : ఇండిగో విమానం ముంబై నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరింది. కానీ ఓ ప‌క్షి ఢీకొన‌డంతో వెంట‌నే తిరిగి ముంబైకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఆదివారం చోటుచేసుకుంది. ఇండిగో విమానం 6E 5047 ముంబై నుంచి ఢిల్లీకి ప‌య‌న‌మైంది. ప‌క్షి ఢీకొన‌డంతో వెన‌క్కి తిరిగి వ‌చ్చింది. దీంతో ప్ర‌త్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌యాణికుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లు ఇండిగో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. నివేదికల ప్రకారం విమానం ఉదయం 8.05 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బ‌య‌లుదేరింది. కాగా బ‌య‌ల్దేరిన కొన్ని నిమిషాల‌కే ప‌క్షి ఢీకొన‌డంతో వెన‌క్కి తిరిగి వ‌చ్చింది. ఆగ‌స్టు 8వ తేదీన సైతం ముంబైకి చెందిన‌ ఎయిర్ ఏసియా విమానం రాంచీ విమానాశ్ర‌యంలో టేకాఫ్ తీసుకునే స‌మ‌యంలో ప‌క్షి ఢీకొట్ట‌డంతో వెన‌క్కి రావాల్సివ‌చ్చింది. అప్పుడు కూడా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.