ధోనీకి బర్డ్ ఫ్లూ దెబ్బ.. 2500 కడక్‌నాథ్ కోళ్లు మృతి

భోపాల్: బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై కూడా పడింది. అతని కోళ్ల ఫామ్ కోసం పెంచిన 2500 కడక్‌నాథ్ కోళ్లు బర్డ్‌ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డాయి. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ధోనీ పౌల్ట్రీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ అంతకంతకూ పెరిగిపోతుండటంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. కడక్‌నాథ్ కోళ్లకు ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రంలోని ఝబువా జిల్లాకూ ఈ బర్డ్‌ఫ్లూ పాకింది. ఈ జిల్లాలోని రుదిపాండా గ్రామంలో ఉన్న కడక్‌నాథ్ కోళ్ల ఫారంలోని కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకినట్లు తేలింది. దీనికి కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్నీ ఇన్ఫెక్టెడ్ జోన్‌గా గుర్తించి.. అక్కడ ఉన్న అన్ని పక్షులనూ చంపనున్నట్లు ఝబువా కలెక్టర్ వెల్లడించారు.
ధోనీ నుంచి ఆర్డర్
తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నుంచి 2000 కడక్‌నాథ్ కోళ్ల కోసం ఆర్డర్ వచ్చినట్లు ఈ కోళ్ల ఫారం ఓనర్ వినోద్ మేదా చెబుతున్నాడు. గత నెలలోనే ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. అయితే వాతావరణం సరిగా లేక వాటిని డెలివర్ చేయలేకపోయామని తెలిపాడు. నల్ల రంగులో ఉండే ఈ కడక్‌నాథ్ కోళ్లలో ఐరన్ చాలా ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందని పేరు. అందుకే ఈ చికెన్‌కు మిగతా వాటి కంటే ధర కూడా ఎక్కువే. ధోనీ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ఈ లాభసాటి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
తాజావార్తలు
- మంత్ర ఆఫ్ యూత్.. బై యూత్.. ఫర్ యూత్
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ