సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 01:54:19

బయో ఇంధనమే ప్రత్యామ్నాయం

బయో ఇంధనమే ప్రత్యామ్నాయం

  • ఉత్పత్తి వ్యయమే అవరోధం
  • ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధనకు ‘బెస్ట్‌ పేపర్‌ అవార్డు’

కంది: ఇంధన రంగంలోకి బయో ఇంధనాన్ని చేర్చేందుకు ఎదురవుతు న్న అవరోధాలను అధ్యయనం చేయడానికి తమ పరిశోధకులు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారని ఐఐటీ హైదరాబాద్‌ తెలిపింది. శిలాజ ఇంధన వినియోగంతో వనరులు తరిగిపోవడం, కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచదేశాలు దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌ వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఐఐటీ బృందం అధ్యయనం చేసింది. అయితే ఉత్పత్తి వ్యయం అవరోధంగా మారినట్టు వీరి అధ్యయనంలో వెల్లడైంది. బయో ఇంధన వినియోగంలో ఉత్పత్తి వ్యయం 43 శాతం ఉండగా, దిగుమతుల ఖర్చు 23 శాతం, రవాణా 17 శాతం, మౌలిక సదుపాయాలకు 15 శాతం ఖర్చవుతున్నట్టు తెలిపింది. వీరి పరిశోధన నివేదికకు ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్‌ పేపర్‌ అవార్డు’ లభించింది. ఈ పరిశోధనకు ఐఐటీ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కిషాలయ మిత్రా, రిసెర్చ్‌ స్కాలర్‌ కపిల్‌ గుమ్టే నేతృత్వం వహించారు. logo