ఆదివారం 07 జూన్ 2020
National - Feb 01, 2020 , 02:38:43

ఈజిప్టు కోటీశ్వరుడితో బిల్‌గేట్స్ బిడ్డ నిశ్చితార్థం

ఈజిప్టు కోటీశ్వరుడితో బిల్‌గేట్స్ బిడ్డ  నిశ్చితార్థం

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ పెద్ద కూతురు జెన్నిఫర్ కేథరిన్ గేట్స్ (23) ఈజిప్టుకు చెందిన సంపన్నుడు నాయెల్ నాజర్ (28)ను పెండ్లి చేసుకోబోతున్నారు. తమకు నిశ్చితార్థం అయ్యిందంటూ వారిద్దరూ సోషల్‌మీడియాలో ప్రకటించారు. ఈ మేరకు ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తాము కొన్నేండ్లుగా సహజీవనం (డేటింగ్) చేస్తున్నామని చెప్పారు. మన ప్రేమమయ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు.. ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నా అంటూ జెన్నిఫర్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. జీవితాంతం నాతో కలిసి నడువడానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా మారాను. జీన్.. ఇకపై నువ్వే నా జీవితం అంటూ నాజర్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారిద్దరూ వచ్చే ఏడాది పెండ్లి చేసుకోబోతున్నారు. నాజర్ ఈజిప్టుకు చెందిన ప్రొఫెషనల్ హార్స్ రైడర్. అతడి కుటుంబానికి కువైట్‌లో నిర్మాణరంగ వ్యాపారం ఉన్నది. నాజర్, జెన్నిఫర్ కలిసి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందని తెలిసింది.


logo