శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 17:47:36

యువకుడి అత్యుత్సాహం..ఎస్‌ఐకి గాయాలు

యువకుడి అత్యుత్సాహం..ఎస్‌ఐకి గాయాలు

పల్ఘార్‌: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పోలీసులు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీస్‌ అధికారిని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో పోలీస్‌ అధికారి తలకు గాయాలయ్యాయి.  రాజ్‌బర్‌ (20) అనే యువకుడు పల్ఘార్‌ జిల్లాలోని ఎవర్‌షైన్‌ నగర్‌లో బైకుపై వెళ్తుండగా..కరోనాపై పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్‌ సనిల్‌ పాటిల్‌ (27)అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు మాత్రం లెక్కచేయకుండా బైకుతో ఎస్‌ఐని ఢీకొట్టాడు. గాయాలతో ఉన్న ఎస్‌ఐని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాజ్‌బర్‌పై ఐపీసీ 355 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. logo