బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 12:33:44

ఒడిశాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ అధిక్యం

ఒడిశాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ అధిక్యం

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఉపఎన్నిక‌లు జ‌రిగిన‌ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార‌ బిజూ జ‌న‌తాద‌ల్ (బీజేడీ) ముందంజ‌లో కొన‌సాగుతున్న‌ది. బాలాసోర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేడీ ఎమ్మెల్యే విష్ణుచ‌ర‌ణ్‌దాస్‌, తిర్తోల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ఎమ్మెల్యే మ‌ద‌న్‌మోహ‌న్ ద‌త్తా మృతిచెంద‌డంతో మృతిచెంద‌డంతో ఆ రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌ల పోలింగ్‌తోపాటే ఒడిశాలోని రెండు స్థానాల‌కు కూడా న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌రిగింది. ఇవాళ ఉద‌యం 8 గంటల నుంచి కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది. ఈ రెండు స్థానాల్లోనూ ప్ర‌స్తుతం బీజేడీ అధిక్యంలో కొన‌సాగుతున్న‌ది.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.