మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:43:06

బీహార్‌లో 36 వేలు దాటిన కరోనా కేసులు

బీహార్‌లో 36 వేలు దాటిన కరోనా కేసులు

పాట్నా : బీహార్‌ రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా  ఆ రాష్ట్రంలో శనివారం 2,803 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 36 వేలకుపైగా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత రెండురోజులుగా రాష్ట్రంలో వరుసగా వెయ్యికిపైగా కేసులు నమోదుకాగా ఇవాళ ఆ సంఖ్య ఏకంగా రెండువేలు దాటింది.

రాష్ట్ర రాజధాని పాట్నాలో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఆగస్టు 3 నుంచి జరగాల్సిన వర్షాకాల చివరి సెషన్‌ సమావేశాలకు వేదిక సైతం మార్చారు. సామ్రాట్‌ అశోక కన్వెన్షన్‌ హాల్‌లో అసెంబ్లీ సమాశాలు నిర్వహించనున్ననట్లు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ సూత్రపాయంగా తెలిపారు.  logo