శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 15:36:00

ముంబై నుంచి వచ్చారని చెప్పినందుకు చంపేశారు

ముంబై నుంచి వచ్చారని చెప్పినందుకు చంపేశారు

హైదరాబాద్‌: కరోనా ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్నది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అది మెళ్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధి తమ కుటుంబీకులకే కాదు, తమ ఊరివారికి కూడా సోకకూడదని భావించాడు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి  మా ఊరికి ఇద్దరు  వచ్చారని చెప్పడమే అతని మృతికి దారితీసింది. 

బీహార్‌లోని సితామర్హి జిల్లా మాధౌల్‌ గ్రామానికి చెందిన ఇద్దరు బతుకుదెరువుకోసం మహారాష్ట్రకు వెళ్లారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ముంబై నుంచి తమ సొంతూరికి మార్చి 20న వచ్చారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన 20 ఏండ్ల బాబ్లు కుమార్‌ మహతో స్థానిక అధికారులకు చెప్పాడు. దీంతో వారిద్దరితోపాటు, వారి కుటుంబసభ్యులను మార్చి 24న డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వారిని స్వీయ నిర్భందంలో ఉండాలని చెప్పారు. దీనిపై ఆగ్రహంతో ఆ రెండు కుటుంబాలకు చెందినవారు ఈ నెల 29న బబ్లు కుమార్‌పై దాడిచేసి చావబాదారు. దీంతో అతడు తీవ్రంగా గయపడి హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. బుబ్లు కుమార్‌ తండ్రి వినోద్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.


logo