మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:52:25

బీహార్‌లో 16 నుంచి లాక్‌డౌన్‌

బీహార్‌లో 16 నుంచి లాక్‌డౌన్‌

పాట్నా : బీహార్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం జూలై 16 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుకు నిర్ణయం తీసుకుంది. అత్యవసర సర్వీసులకు, వ్యవసాయ పనులకు, నిర్మాణ-అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చింది. ప్రార్థనా మందిరాలు, వాణిజ్య, ప్రైవేట్‌, పలు ప్రభుత్వ సంస్థలను పూర్తిగా మూసివేయనున్నట్లు పేర్కొంది. 

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వాటి ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. డిఫెన్స్‌, సెంట్రల్‌ ఆర్మీ పోలీస్ ఫోర్స్‌, ట్రెజరీ, ప్రజల వినియోగార్థం ( పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ, పీఎన్‌జీ), విపత్తు నిర్వహణ, విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌ యూనిట్లు, పోస్టాఫీసులు, జాతీయ ఇన్‌ఫెర్మేటిక్స్ సెంటర్‌‌ కార్యకలాపాలకు మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.  పోలీసులు, హోంగార్డులు, ఫైర్‌, అత్యవసర సర్వీసులు, విపత్తు నిర్వహణతోపాటు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తమ విధులను యథావిధిగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


logo